AP: బుడమేరు, పోలవరం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సీజన్ మొదలయ్యేలోగా బుడమేరు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్లో పెండింగ్ పనులు పూర్తికి యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పారు. బుడమేరు ఓల్డ్ చానల్‌కు సమాంతరంగా మరో కొత్త చానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం ఎడవ కాల్వ పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని తెలిపారు.