BPT: 2023 జూన్‌లో చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి చెందిన మైనర్ యువకుడు ఉప్పాల అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి దహనం చేసిన హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు న్యాయపరంగా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో వినుకొండకు చెందిన హైకోర్టు న్యాయవాది కావూరు గోపీనాథ్‌ను ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం బుధవారం నియమించింది.