NLR: ప్రైవేట్ ట్రావెల్స్ తీరుతో ఉదయగిరి వాసులు ఇబ్బంది పడ్డారు. 30మంది ప్రయాణికులతో రాత్రి హైదరాబాద్ నుంచి ఓ బస్సు ఉదయగిరి బయల్దేరింది. మార్గమధ్యలో నాగార్జునసాగర్ వద్ద రాత్రి 2గంటల సమయంలో పొగలు రావడంతో బస్సును నిలిపివేశారు. మరో వాహనం ఏర్పాటు చేయకుండా బస్ డ్రైవర్ సమీప ప్రాంతంలో మద్యం తాగుతూ తమను పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు.