TG: అభివృద్ధి పథంలో నడుస్తోన్న భారత్‌పై ఉగ్రదాడి జరిగిందని, ఈ దాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలన్నారు. ఉగ్రవాదం పోరులో ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. పాకిస్తాన్‌ను ఓడించి.. పీవోకేను భారత్‌లో కలపాలని అన్నారు.