NRML: చెక్ బౌన్స్ కేసులను రాజీ పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాంకు అధికారులతో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాంకులు, చిట్ ఫండ్స్లలో నమోదైన పెండింగ్ కేసులను పరస్పర రాజీమార్గంతో పరిష్కరించుకోవాలన్నారు.