TPT: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు యూట్యూబ్ ద్వారా చేరువ చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఈవో, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.