ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్లో కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని తెలిపారు.