GNTR: మంగళగిరి పరిధిలోని మార్కండేయ కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకలో అతిథులు వధూవరులను ఆశీర్వదిస్తూ ఇచ్చిన నగదు కానుకలు రూ.3.50 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మండపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.