CTR: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు ఈ నెల 24వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయాలని డీఈవో వరలక్ష్మి మంగళవారం ప్రకటనలో కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు.. సీనియారిటీ ప్రాతిపదికన గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా త్వరలో ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు ఆమె చెప్పారు.