కృష్ణా: మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో మంగళవారం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.