VZM: తెర్లాం మండలం నందిగాంలో గల ప్రత్యేక విద్యా అవసరాలున్న పిల్లలను ఎంఈవో త్రినాథరావు, ఐఈఆర్టీ సూర్యారావు శనివారం పరిశీలించారు. దివ్యాంగ పిల్లల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితిని గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఇంటి వద్ద అందిస్తున్న హోం బేస్డ్ విద్యపై ఆయన ఆరా తీశారు. దివ్యాంగ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వియోగించుకోవాలన్నారు.