శ్రీకాకుళం: ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. మున్సిపల్, సచివాలయం, మెప్మా సిబ్బంది హాజరుకావాలని సూచించారు.