MDK: జిల్లాలో సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, చిలిపిచేడ్, మాసాయిపేట మండలాల్లో అకాల వర్షం పడటంతో చాలా చోట్ల ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. యాసంగి వరి కోతల సమయంలో ఇలాంటి వానలు పడడంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు