SRD: గుడ్ ఫ్రైడే సందర్భంగా పటాన్చెరు మండలం ముత్తంగిలో దివ్యవాణి చర్చిలో చేర్చి పాస్టర్ సిరిల్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు శిలువ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. యేసుక్రీస్తు శిలువ మోసిన విధానం, ఆయనను భటులు హింసించిన తీరును కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. చర్చికి హాజరైన క్రైస్తవ సోదరులు మంత్ర ముగ్ధులయ్యారు.