TG: రాష్ట్రంలో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు NTT డేటా ముందుకు వచ్చింది. టోక్యో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు MOU చేసుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యం గల.. 25 వేల సీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో క్లస్టర్ నిర్మాణం చేపట్టనుంది. తెలంగాణను ఏఐ రాజధానిగా ఈ ప్రాజెక్టు తీర్చిదద్దనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.