ప్రకాశం: జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆర్.సి.ఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరులు కృష్ణ కిషోర్ సిలువను మోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు త్యాగానికి ప్రతీకగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారని అన్నారు.