KDP: యుటిీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కడప నగరంలోని తారకరామా నగర్లో యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా ట్రెజరర్ నరసింహారావు కలిసి ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.