SKLM: రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 9 గంటల నుండి జనసేన క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ విశ్వక్ సేన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న క్రియా వాలంటీర్స్ అందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు.