శ్రీకాకుళం: జిల్లాలోని బలగ సాయినగర్ కాలనీకి చెందిన కె.కామేశ్వరరావు (92) శుక్రవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, ఉమల ద్వారా అతని కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.