VZM: రాజాంలో శుక్రవారం క్రైస్తవుల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాట్లును వివిధ వేషధారణలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రధాన మెయిన్ రోడ్డులో ప్రార్థనలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లారు. క్రీస్తు మరణానికి సంబంధించిన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.