VZM: వంగర మండలం అరసాడ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు కష్టం ఎక్కువ జీతం తక్కువ అని, మండుటెండలో కష్టపడుతున్న తమకు రోజంతా కష్టపడ్డా రూ.60 నుంచి రూ.100లోపే అకౌంట్లో పడుతుందన్నారు. అంతకన్నా ఎక్కువ ఇవ్వటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.200 రూపాయలు పైనే ఉంటుందని, కానీ అవి తమ దగ్గరికి వచ్చేసరికి ఆ కూలీ డబ్బులు తగ్గిస్తున్నారని కూలీలు వాపోయారు.