NRML: రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు 3371గా నిర్ణయించడం జరిగిందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ పంటలు అమ్మి లాభాలు పొందాలని సూచించారు.