కృష్ణా: గ్రామాల్లో అధ్వానంగా మారిన అంతర్గత రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గురువారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో రూ.43లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ముస్తాబాద్‌లో రూ.71లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు.