కృష్ణా: నాగాయలంక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో ఇవాళ బోట్ల ఎన్యూమరేషన్ మత్స్య శాఖ అధికారులు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సేవ సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు తెలిపారు. ఆయన నాగాయలంక మత్స్య భవనం వద్ద విలేఖరులతో మాట్లాడారు. బోట్ల యజమానులు కళాసీలతో పాటు అవసరమైన అన్ని పత్రాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో హాజరు కావాలన్నారు.