VSP: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర జలాలో చేపల వేట నిషేధమని విశాఖ మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. సముద్ర జలాలలో చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కోసం వేట నిషేధం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే బోట్లను, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రాయితీలు నిలిపివేస్తామన్నారు.