KDP: గోపవరం మండలంలోని బుచ్చన్న పల్లెలో అంకాలమ్మ తిరుణాల సందర్భంగా ఈ నెల 20 తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి వృషభ రాజుల చేత బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.40 వేలను నిర్ణయించారు. మొత్తం నాలుగు బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.