ASR: అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు లభించినట్లు వైద్యాధికారి జ్ఞానేశ్వరి తెలిపారు. గతనెల 24న జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం అనంతగిరి ఆసుపత్రిని సందర్శించింది. నిర్వహణ బాగుండటంపై బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని, దీంతో ఆసుపత్రికి 91.64 శాతంతో జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని వైద్యాధికారి జ్ఞానేశ్వరి చెప్పారు.