KDP: గోపవరం మండలం బుచ్చనపల్లెలో గ్రామంలో వెలసిన అంకాలమ్మ సమేత మల్లెం కొండేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా 18న రాత్రి అమ్మవారి గ్రా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామోత్సవముతో పాటు అంకాలమ్మ తల్లి కోలాట బృందం వారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.