TG: సిర్పూర్ MLA పాల్వాయి హరీష్‌బాబు దీక్ష విరమణ చేశారు. జీవో 49కి వ్యతిరేకంగా హరీష్ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో BJP MLAలు ఆయన చేత దీక్ష విరమింపజేశారు. కాగా, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని 3 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని ‘కుమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్’గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో 49ను జారీ చేసింది.