SRD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రజతోత్సవ స్ఫూర్తితో పోరాటంపై ముందుకు సాగుదామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మాణిక్యం పాల్గొన్నారు.