SRD: కేసుల పరిష్కారంలో ఫింగర్ ప్రింట్స్ కీలకమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఫింగర్ ప్రింట్, ఎంఎస్ డీసీ డివైస్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో ఆస్తి తగాదాల కేసులు, సస్పెక్ట్ చెక్, గుర్తు తెలియని మృతదేహాల ఫింగర్ ప్రింట్స్ సేకరించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.