BPT: బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్ ప్రాంతంలో గురువారం కొండ తేనెటీగలు స్థానికులపై దాడికి దిగాయి. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేనెటీగల దాడి ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. తేనెటీగలు మదినచేసే స్థలాన్ని ఏదైనా బద్దలై ఉండడం వల్ల అవి దాడికి దిగే అవకాశముందని స్థానికులు తెలిపారు.