పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయా కేసుల్లో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కారాగారంలో తనపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. అయితే, వీటిని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ తోసిపుచ్చారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించడం కాకుండా.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.