MBNR: జిల్లాలో చిరుతలు సంచారంతో కలవరపెడుతున్నాయి. తాజాగా నవాబ్ పేట మండల పరిధిలోని యన్మన్ గండ్ల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. కాగా దేవరగుట్ట ప్రాంతంలో మూడు రోజలుగా రెండు చిరుతలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని గురువారం అధికారులు సూచించారు.