NLR: రాపూరు మండలంలోని రావి గుంటపల్లి, పులిగలపాడు, బొజ్జనపల్లి, వీరాయపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ చేస్తూ స్థానిక ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.