NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో గ్రామంలో ప్రతీ ఇంటికి తిరిగే కార్యక్రమాన్ని చేపడుతున్నామని టీడీపీ నేత కిరణ్ కుమార్ తెలిపారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తామన్నారు.