రక్షణాత్మక విధానాలతో అంతర్జాతీయ సరఫరా గొలుసుపై ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్పత్తి ఖర్చు పెరిగే అవకాశం ఉందని తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. విధానపరంగా వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులతో ప్రపంచ అంతరాయాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.