MBNR: ఎర్ర సత్యం కాలనీలో ఉన్న చెరువులో నుంచి నీటిని ఇసుక మాఫియా దారులు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇసుక ఫిల్టర్ చేసేందుకు దీనిని వాడుతున్నారని చెప్పారు. వీరి అక్రమ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.