అన్నమయ్య: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, పెన్షన్లు మంజూరు చేసి పేదల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లెలోని వారి నివాసంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.