KMM: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. శిరీష భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని CM ఆకాంక్షించారు.