TG: అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని మాజీమంత్రి KTR అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘రూ.10వేల కోట్ల స్కామ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత కుట్ర. త్రీడీ మంత్రంతో సర్కార్ పాలన చేస్తోంది. మోసం, విధ్వంసం, డైవర్షన్ చేయటమే కాంగ్రెస్ విధానం. కంచ గచ్చిబౌలిలో పర్యావరణ హననం చేసింది’ అని మండిపడ్డారు.