కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పొత్తులు, కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.