MDK: మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి ప్యాడి క్లీనింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఆర్డీవోలు పాల్గొన్నారు.