ప్రకాశం: రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అన్నారు. దీని వల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ఇక వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి 44 రోజులు జైల్లో ఉంచినట్లు గుర్తుచేశారు.