NDL: ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం బనగానపల్లె మండలంలోని బతులూరుపాడు, ఎనకండ్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాప్, గిడ్డంగులను తనిఖీ చేశారు. రేషన్ షాప్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.