TPT: వాహనాలతో రాంగ్ రూట్లో ప్రయాణిస్తే చర్యలు తప్పవని రేణిగుంట DSP శ్రీనివాసరావు అన్నారు. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట, గాజులమండ్యం ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన 77 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరపరచగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జరిమానా విధించారు.