చైనా మినహా మిగతా దేశాలకు ట్రంప్ సుంకాల నుంచి ఊరట లభించింది. మిగతా దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు చైనాపై టారిఫ్‌ను 125 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. కాగా అమెరికా వస్తువులపై చైనా 84శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.