SRD: రాయికోడ్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర ఈనెల 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.