ATP: శింగనమలలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారిందని అన్నారు. శింగనమల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం తరఫున 500 కుట్టుమిషన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.