ASF: కాగజ్ నగర్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయనే పక్కా సమాచారం మేరకు బుధవారం ట్రాన్స్పోర్ట్ దుకాణాలపై దాడులు చేసి 45 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ CI రాణ ప్రతాప్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందని సీజ్ చేసిన విత్తనాలు కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు.